బాలీవుడ్ హీరోలు తమకు హిట్టు రాకపోతే సౌత్ సినిమాల వైపు చూడడం ఆనవాయితీగా మారిపోయింది. అనాదికాలం నుంచి బాలీవుడ్ హీరోలు చాలామంది సౌత్ సినిమాలు నమ్ముకొని హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరం హీరోలు అయిన అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ లాంటి హీరోలు సౌత్ సినిమాలు చేసి ముఖ్యంగా తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్లు కొట్టి స్టార్ లుగా ఎదిగారు. సల్మాన్ ఖాన్ అయితే తన కెరీర్ లో పది సినిమాల దాకా సౌత్ సినిమాలను రీమేక్ చేయగా, తాను సూపర్ స్టార్ గా ఎదగడం లో సౌత్ సినిమాలు కీలక పాత్ర పోషించాయని ఒప్పుకున్నారు.

ప్రస్తుతం కొంతమంది బాలీవుడ్ హీరోల కెరీర్ సరిగా లేకపోవడంతో వారు మళ్లీ సౌత్ సినిమాల ని నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఏకంగా రెండు టాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా తో పాటు ఆయన చేయబోయే కిలాడి సినిమా కూడా విడుదల కాకముందే రైట్స్ తీసుకుని దగ్గర పెట్టుకున్నారట. ఈయన తో పాటు టాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా సౌత్ సినిమాలపై మనసు పడ్డారట. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు మొదలు పెట్టారట. గతంలో కూడా అక్షయ్ కుమార్ తనకు హిట్ కోసం సౌత్ సినిమాలను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో అక్షయ్  తుపాకి సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇంకా ఈ జాబితాలో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. గజిని సినిమాను బాలీవుడ్ లో చేసి హిట్ కొత్తగా ఇప్పటికీ ఆ సినిమా రికార్డులను ఏ సినిమా దాటలేకపోతుంది. షాహిద్ కపూర్ కబీర్ సింగ్ తో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.  ఇప్పుడు ఆయన టాలీవుడ్ సినిమా జెర్సీ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: