
టాలీవుడ్ ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ అనే సినిమాలో తెరకెక్కించగా ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ నుంచి వచ్చే మొట్టమొదటి సినిమా లవ్ స్టోరీ అని చెబుతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఈ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.
ఇకపోతే శేఖర్ కమ్ముల ప్రస్తుతం టాలీవుడ్ లో కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. అందుకు కారణం ఆయన ధనుష్ లాంటి స్టార్ హీరో తో సినిమా ప్రకటన చేయడమే. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే నెట్టుకొచ్చిన శేఖర్ కమ్ముల తొలిసారి ఓ స్టార్ హీరో ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్నీ సక్సెస్ అయిన నేపథ్యంలో ధనుష్ ఆయనకు ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో ఇంతవరకు ఒక్క పెద్ద స్టార్ తో సినిమా చేయలేకపోయినా శేఖర్ కమ్ముల లో ఏమి చూసి ధనుష్ అవకాశం ఇచ్చారు అని కోలీవుడ్ లో చర్చలు పెట్టుకున్నారట.
ఆయన దగ్గర శిష్యరికం చేసిన శిష్యులు పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. నాగ్ అశ్విన్ తొలి రెండు సినిమాలను చిన్న స్టార్లతో నే చేసి ఇప్పుడు ప్రభాస్ సినిమా పట్టేశాడు. ఇది శేఖర్ కమ్ముల ఫ్యాన్స్కి కొంత నిరాశనే కలిగించగా ఇప్పుడు ధనుష్ తో సినిమా ఓకే అవ్వడం వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. శేఖర్ కమ్ముల కి ధనుష్ అవకాశం ఇవ్వడానికి ముఖ్య కారణం ఆయన తయారుచేసుకున్న కథేనట. మన స్టార్లు నమ్మని డైరెక్టర్ అయినా శేఖర్ కమ్ముల ను తమిళంలో పెద్ద స్టార్ అయినా ధనుష్ నమ్మడం వెనుక అసలు విషయం ఇదే అంటున్నారు. ఇది చూసి మన హీరోలకు శేఖర్ కమ్ముల మీద ఎందుకు భరోసా కలగలేదు అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరి హిట్ ఇస్తే అన్నా మన హీరో లు సినిమాలు చేస్తారేమో చూడాలి.