టాలీవుడ్ లో వెరైటీ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో శర్వానంద్. ఆయన తొలి సినిమా నుంచి వైవిధ్యం తప్పకుండా కనబడుతుంది. సినిమాల ఫలితాలు అటు ఇటు అయినా కూడా తన సినిమాలలో ప్రేక్షకులకు నచ్చే అంశాలు, వినూత్నమైన కథ తప్పకుండా ఉంటాయి. ఈ ప్రయత్నాలు పక్కనపెడితే శర్వానంద్ గత కొంతకాలంగా హిట్ అనేది లేకుండా పోయింది. ఆయన హీరోగా చేసిన చాలా సినిమాలు గత నాలుగు సంవత్సరాలుగా ఫ్లాప్ లు అవుతున్నాయి. ఆయన ఆఖరి హిట్ శతమానం భవతి సినిమా అని చెప్పవచ్చు.

ఆ తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చింది. రాధా, మహానుభావుడు, పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం.. ఈ సినిమాల్లో మహానుభావుడు సినిమా ఒక్కటే పర్వాలేదు అనిపించుకున్న మిగతావన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న మహాసముద్రం సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు శర్వానంద్. నాలుగేళ్ల నిరీక్షణకు మహా సముద్రం సినిమా సమాధానం చెబుతుందని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ నేపథ్యంలో శర్వానంద్ ఇమేజ్ కానీ పారితోషికం తీసుకునే విషయంలో గానీ ఇంచు కూడా తగ్గం లేదని టాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చినా కూడా ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మహాసముద్రం సినిమా ముందు వరకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుne శర్వానంద్ కానీ ఈ సినిమా కోసం ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. దీన్నిబట్టి శర్వానంద్ కు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇదే సినిమాతో చేస్తున్న సిద్ధార్థ మూడుకోట్ల రెమ్యూనరేషన్ సొంతం చేసుకున్నాడు.  ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: