టాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్ లు వచ్చి తమ గ్లామర్ తో, నటనతో, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. చాలామంది ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచి పోయేలా తమ అందాలతో కట్టిపడేశారు.  అలాంటి హీరోయిన్లలో ఒకరు మీరాజాస్మిన్. అమ్మాయి బాగుంది లాంటి చిన్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ ఆమె చేసిన రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో నటించి స్టార్ హీరోయిన్ అయింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తో ఆమె రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా ఛాన్స్ కొట్టి వరుసగా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది.

దాంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు టాలీవుడ్ ని ఏలుతుంది అని అనుకున్నారు. కానీ ఆమె ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాల ఫలితాలు దారుణంగా ఉండడంతో ఆమె కొద్ది కాలంలోనే తన తెలుగు సినిమా కెరీర్ కు స్వస్తి పలికింది. తెలుగులో ఆమె 2013లో నటించిన మోక్ష చిత్రమే ఆఖరిది. ఇక ఆమె పేరున్న చిత్రం 2009లో అ ఆ ఇ ఈ అనే సినిమాలో ఆఖరిగా తెలుగులో నటించారు. కానీ తమిళంలో మాత్రం ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు అక్కడ అ ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది.

మలయాళం ఇండస్ట్రీలో కూడా ఆమెకు మంచి పేరుంది. కన్నడలో ఒకటి రెండు సినిమాలతో ఆకట్టుకుంది. ఇలా సౌత్ ఇండియా మొత్తం నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు మీరా జాస్మిన్. ఇటీవలే ఆమె తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటూ తన కొత్త కొత్త అప్డేట్స్ లేటెస్ట్ ఫోటోలను అప్లోడ్ చేస్తుంది. అయితే ఈ మధ్యన ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే చాలా సన్నగా మారిపోయి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు. సినిమాల్లో నటించే టైంలో బొద్దుగా కనిపించిన ఈమె ఇప్పుడు ఇలా సన్నగా మారడం వెనుక కారణం ఏమై ఉంటుందని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. రీ ఎంట్రీ కోసం ఏమైనా ప్రయత్నిస్తుందా అని అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: