తమిళనాట స్టార్ హీరోగా ఉన్న
అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్
అజిత్ సొంతం. స్టార్ హీరోగా ఎన్నో సంవత్సరాలనుంచి కోలీవుడ్లో ఉన్న ఆయనకు తెలుగులో కూడా మంచి
మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా విడుదల అవుతూ మంచి వసూళ్లను సొంతం చేసుకుంటాయి. తమిళనాట ఎంత క్రేజ్ ఉందో తెలుగునాట కూడా అంతే క్రేజ్ నెలకొని ఉంది
అజిత్ కి. ప్రస్తుతం ఆయన వాలిమై అనే
సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్, నేషనల్ స్థాయిలోనే కాదు ఇంటర్నేషనల్ లెవల్లో అభిమానులు హంగామా చేస్తున్నారు.
ఈ సినిమాలో
టాలీవుడ్ హీరో
కార్తికేయ విలన్ గా నటిస్తుండడం తో తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరుచుకుంది. సోషల్
మీడియా మొత్తం ఈ
సినిమా క్రేజ్ తో ఊగిపోతుంది. ఆయన ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సోషల్
మీడియా లో
రచ్చ రచ్చ చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా వాలిమై ఫ్యాన్స్ హంగామా
పీక్స్ కి చేరుకుంది. వినోద్ దర్శకత్వం లో నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ లేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆవేశ పడుతున్నారు అయితే త్వరలోనే అభిమానులు ఆకలిని తీరుస్తాను అని చెప్పింది చిత్ర బృందం.
ఈ సినిమాలో
అజిత్ సిబిసిఐడి ఆఫీసర్ గా రేసర్ గా కూడా కనిపిస్తారని తెలుస్తోంది .ఈ సినిమాతో వినోద్ తో హ్యాట్రిక్
మూవీ చేస్తున్నట్లు చేస్తున్నట్లు
అజిత్ ప్రకటించగా, తాజాగా ఈ దర్శకుడితో మరో
మూవీ కూడా ప్రకటించారు. ఇక
అజిత్ పర్సనల్ విషయానికి వస్తే ఆయన పూర్తిగా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పవచ్చు. సినిమాలు తప్ప బయట ఎక్కడ కనిపించడు అజిత్. ఆయన
భార్య నటి శాలిని తో కలిసి
అజిత్ ఇటీవలే ప్రముఖ హోటల్ లో మెరిశారు. వారితో వారి కు కూడా ఉండడం విశేషం. హోటల్ సిబ్బంది గుర్తించి ఫోటో కోసం ఇవ్వగలరా అని అడిగారు. అలా కొడుకుతో కలిసి దిగిన
అజిత్ ఫోటో సోషల్
మీడియా లో వైరల్ అవుతుంది.
అజిత్ కి ఇద్దరు పిల్లలు.