తెలుగు సినిమాలలో హాస్యనటులు అంటే ఎక్కువగా నటులే కనిపిస్తుండటం చూస్తూ ఉంటాం.  కానీ నటీమణులు హాస్యనటీమణులు గా కనిపించడం చాలా తక్కువ. ఎక్కువగా సెంటిమెంట్ పాత్రలు మాత్రమే చేస్తూ గుర్తింపు పొందుతూ ఉంటారు. మహిళా ఆర్టిస్టులు.  ఈ నేపథ్యంలో అతి తక్కువ మంది హాస్య నటీమణులు ఉన్న ఇండస్ట్రీ గా టాలీవుడ్ నిలుస్తుంది.  ఆ తరం నుంచి ఈ తరం టాలీవుడ్  హాస్యనటిమణులు ఎంతమంది ఉన్నారంటే వేళ్లమీదనే లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో ఒకరు గిరిజ.

ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా కొన్ని దశాబ్దాల క్రితం హాస్య నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు గిరిజ. తనకు మాత్రమే సొంతమైన నటనతో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అప్పట్లో రేలంగి గిరిజ కామెడీ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా సూపర్ హిట్ అన్న విధంగా వీరి కాంబినేషన్ కోసం ఎగబడేవారు. ఆ విధంగా ఎన్నో సినిమాల్లో నటించి గిరిజ గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు.   

నవ్వితే నవరత్నాలు, పాతాళభైరవి, ధర్మదేవత, భలే రాముడు, భలే అమ్మాయిలు,  అప్పు చేసి పప్పు కూడు, భట్టి విక్రమార్క సినిమాలో ఓ కీలక పాత్రలలో నటించారు. ఆమె నటిగా కొన్ని సినిమాల్లో నటించి వచ్చిన డబ్బుతో నిర్మాతగా మారారు. అలా ఆమె నిర్మాతగా చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కాగా ఆమె ఒక్కసారిగా అప్పులు ఎక్కువయ్యాయి. ఆకులు పెట్టలేక గిరిజ ఎన్నో కష్టాలను అనుభవించింది.  చివరికి అద్దె కూడా కట్టలేని దీన స్థితిలోకి వెళ్లారు.  ఎంతోమందిని నవ్వించిన గిరిజ తీరని కష్టాలను అనుభవిస్తూ మరణించడం గమనార్హం. కొందరు సహా నటీమణులు ఆమెకు తమ వంతు సహాయం చేయగ తన కూతురు మాత్రం సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. మలయాళంలో సలీమా పేరుతో గిరిజ కూతురు నటించారు. ఆమె అసలు
 పేరు శ్రీ రంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: