యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెర మీదే కాదు. బుల్లితెర మీద కూడా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాడు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ షోతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో స్టార్ మాలో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షో ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో మరో ప్రముఖ చానల్ జెమినిలో టెలీక్యాస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షో కోసం జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పటికే సంప్రదించిన షో నిర్వాహకులు ఆయన వద్ద నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారట.



ఈ షో కోసం తారక్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇది వరకే వార్తలు వచ్చాయి. ఈ షోకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల జెమిని టీవీలో విడుదల చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు ఈ షోను త్వరగా ప్రసారం చేయాలని ఉత్సుకతతో ఉన్నారట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఈ షో కూడా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని ప్రస్తుతం తెలుస్తోంది.


ఈ షోకు సంబంధించిన  షూటింగ్ ను ఈ వీకెండ్ లో చేసేందుకు సిద్ధమయ్యారట. జూలై ఏడు నుంచి ఈ షూటింగ్ ను ప్రారంభించాలని టీం భావిస్తుందట.  ఎలాగైనా త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి వచ్చే నెల నుంచి ఈ షోను ప్రసారం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాకుండా ఈ షోలో నాలెడ్జ్కు కూడా ప్రాధాన్యం ఉండటంతో ఎలాగైనా సరే హిట్ అవుతుందని నిర్వాహకులు చాలా నమ్మకంగా ఉన్నారట. ప్రస్తుతం యంగ్ టైగర్ రాజమౌలి దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ RRR లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: