
అమెరికాలో ఒక ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ..తమ సంస్థకు కు చెందినటువంటి వర్జిన్ గెలాక్టిక్ అనబడే వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ వ్యోమనౌకలో మొత్తం ఆరు మంది ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అందులో ఈ సంస్థ అధిపతి అయిన సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వ్యోమ నౌకలో ఈ ప్రైవేటు అంతరిక్షయానం సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష కూడా ఒకరు పాలు పంచుకోవడం మన తెలుగు ప్రజలకు గర్వకారణం .
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమెను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.." ఇప్పటివరకు ఎవరూ అందుకోలేని ఒక అద్భుతమైన ఫీట్ ని అందుకొని, మీ చిన్ననాటి కలలను అక్షరాల నిజం చేసుకుంటూ.. మీరు అంతరిక్షంలోకి వెళ్లడం ..మీ తల్లిదండ్రులకు, తెలుగు ప్రజలకు, భారతీయులందరికీ గర్వకారణం. మీరు వెళ్తున్న అంతరిక్ష మిషన్ గొప్పగా విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను.." అంటూ చిరంజీవి తన సందేశాన్ని పంపారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన ఒక గంట లోపే 6 వేల లైక్ లు, 1,140 రీ ట్వీట్ లు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లూసీఫర్ సినిమాను కూడా రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు చిరంజీవి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.