టాలీవుడ్ లో వెరైటీ చిత్రాలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో అవడానికి దూసుకుపోతున్న హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మొదట్లో వివిధ రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పును పొందింది జ్యోతిలక్ష్మి సినిమా లోని హీరో పాత్ర ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుని హీరో గా నిలబడ్డాడు. ఆ తర్వాత సత్యదేవ్ లోని టాలెంట్ ను గుర్తించిన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్, రెండో హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లు సూపర్ హిట్ కావడంతో ఆయనకు వరుస సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య,  గువ్వా గోరింక వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి హీరోగా సెటిల్ అయిపోయిన సత్యదేవ్ ప్రస్తుతం వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే తిమ్మరసు అనే ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో కూడా ఆయన హీరోగా నటిస్తున్నాడు. ఇంకా గాడ్సే అనే సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. హిందీ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామసేతు అనే సినిమాలో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు సత్యదేవ్. 

ఈ నేపథ్యంలో ఆయన హీరోగా తెరకెక్కిన పలు సినిమాలు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓ టీ టీ లలో విడుదల కావడంతో ఆయనపై ఓటిటీ స్టార్ అనే ముద్ర పడిపోతుంది. ఈ ప్రశ్నను ఓ సందర్భంలో ఆయనను అడగగా తాను ఆ చట్రంలో ఏమాత్రం ఇరుక్కుపోను తప్పకుండా దాన్ని అధిగమించే సినిమాలను మంచి బడ్జెట్ ఉన్న సినిమాలను మాత్రమే చేస్తానని తెలిపారు. ఆయన చేస్తున్న సినిమాలో గాడ్సే, స్కైలాబ్ సినిమాలు కొత్త రకం గా ఉంటాయని తెలిపారు. ఇక తనకు దర్శకత్వం చేయాలనే కోరికను కూడా వెళ్లబుచ్చారు. ముందు తనలోని నటుడిని సంతృప్తి పరచి ఆ తర్వాత మెగాఫోన్ పై దృష్టి పెడతాను అన్నారు. ఎన్నేళనా ఈ కోరికలు తీర్చుకుంటాను అని ఆయన వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: