టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్ లకు లక్ ఎలా కలిసి వస్తుంది అంటే చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తిరుగు లేని క్రేజ్ ను సంపాదించుకున్నారు.  ఆ విధంగా ఎంతో మంది చిన్న వయసులో టాలీవుడ్ కి పరిచయం అయ్యి స్టార్ హీరోయిన్ లు గా ఎదిగారు. అలాంటి వారిలో చాలామంది చిన్న వయసులోనే క్రేజ్ సంపాదించుకున్నారు. కృతి శెట్టి కి చాలా చిన్న వయసులోనే క్రేజ్ వచ్చింది. ఆమెకు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ వుంది అంటే కోట్లు ఇచ్చి మరీ తమ సినిమాలలో బుక్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. రష్మీక మందాన కూడా చిన్న వయసులోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది.

ఇదే క్రమంలో మరో హీరోయిన్ కేవలం 17 సంవత్సరాల కే భారీ క్రేజ్ సంపాదించుకుని అవకాశాలు దక్కించుకుంటుంది. ఆ యంగ్ బ్యూటీ కి ఇప్పుడు కోలీవుడ్లో మామూలు పాపులారిటీ లేదు. ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే క్రేజీ ఛాన్సులు కొట్టేసింది యశిక ఆనంద్. పదిహేడేళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి రావడంతోనే కవాలై వెండం సినిమాలో నటించింది. ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమాలో నటించడంతో ఆమె కు సోషల్ మీడియా సర్కిల్లో బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. 

అప్పటి నుంచి సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును కవ్విస్తు ఛాన్సుల కోసం ఎర వేయడం మొదలు పెట్టేసింది. ఇటీవలే ఆమె గ్లామర్ కు గేట్లు ఎత్తివేయడంతో తమిళంలో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి ఇక్కడ తెలుగులో కూడా మీడియం రేంజ్ స్టార్ హీరోలు ఆమెతో రొమాన్స్ చేసేందుకు తహతహ లాడుతున్నారు. మరి టాలీవుడ్ లో ఈ అందాల ముద్దుగుమ్మలు ఎప్పుడు తమ సినిమాల్లో దర్శక నిర్మాతలు తీసుకుంటారో చూడాలి. ఈ లేత అందాలను చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: