టాలీవుడ్ లో నటిస్తున్న నటీనటుల గురించి వారి జీవితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వీరు తమ సినిమాలకు ప్రాణం పెట్టి పని చేస్తారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాని ఊపిరిగా బ్రతుకుతూ ఉంటారు. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా తమని తాము సినిమాకి అర్పించుకున్నారు ఎంతోమంది నటీనటులు. ఆ విధంగా తెలుగులో అద్భుతంగా రాణించిన కోవై సరళ తెలంగాణ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ శకుంతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాస్యనటులుగా వీరిద్దరూ తెలుగు సినీరంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీరు తెరపై కనిపిస్తే నవ్వులు పూయాల్సిందే. సీటీ లు మారుమోగి పోవాల్సిందే.  హీరోలకు ఉండే క్రేజ్ ను సంపాదించుకొని బాష యాస డైలాగులతో ప్రత్యేకత తెచ్చి పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. మహారాష్ట్ర లో పుట్టి పెరిగిన కడియాల శకుంతలా 250కి పైగా చిత్రాల్లో తన నటనతో అజరామరంగా నిలిచి పోయారు. ముఖ్యంగా టాలీవుడ్ లో తెలంగాణ యాస రాయలసీమ యాస తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒంటి కాలి పురుగు తో రంగస్థల నటిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగారు.

కోవై సరళ తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించి తమిళ తెలుగు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్నారు. రెండు భాషల్లో ఇప్పటిదాకా 750 సినిమాల్లో నటించి మంచి కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు. లేడీ కమెడియన్స్ దొరకని ఇండస్ట్రీలో అందరికీ సమాధానం గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ గా కమల్ హాసన్ కు జోడిగా సతీలీలావతి సినిమా తెలుగులో ఎన్నో మర్చిపోలేని పాత్రలు చేసి స్టార్ గా ఎదిగారు. నలుగురు అక్క చెల్లెలు ఉన్న కుటుంబంలో పెద్ద కుమార్తె అయినా సరళ వారి చదువు సంధ్య వివాహ సందడిలో ఉండిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: