కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా సమ్మర్ లో రావలసిన సినిమాలు అన్నీ వాయిదా పడటంతో ఇప్పుడు ఆసినిమాలు అన్నీ వరసగా రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. వాస్తవానికి ఇంకా ధియేటర్లు ఓపెన్ అవ్వలేదు. జూలై నెలాఖరు నుండి ఓపెన్ కాబోతున్నాయి. ఆగష్టులో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.


అయినప్పటికీ సినిమాలకు జనం వచ్చి తీరుతారు అన్న నమ్మకంతో సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నారు. సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆతరువాత కిరణ్ అబ్బవరం ‘SR కల్యాణ మండపం’ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాలు ఆగష్టు 6న రాబోతున్నాయి.


ఇంతవరకు సమస్య లేదు కాని ఆతరువాత వారంలో వచ్చే ఆగష్టు 13 గురించి తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం కావడంతో పాటు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పడబోతోంది. ఈ ఫెస్టివల్ మూడ్ తో జనం విపరీతంగా బయటకు వచ్చి రకరకాల వస్తువులు కొనడానికి అదేవిధంగా సినిమాలకు హోటల్స్ కు క్యూ కడతారని ఒక అంచనా.


దీనితో పండుగ వాతావరణాన్ని తలపించే ఆవీకెండ్ కోసం సినిమాల విడుదల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈడేట్ తమకే కావాలి అంటూ ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ నిర్మాతలు ఎవరికీ ఆగస్టు 13 కోసం పోటీ పడుతున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇండిపెండెన్స్ డే వీక్ ని క్యాష్ చేసుకోవాలని ఆడేట్ ని ‘పుష్ప’ లాక్ చేసి పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ డేట్ ను ‘పుష్ప’ వదులుకోవడంతో ఆడేట్ కోసం నాని నాగచైతన్యల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రాజీ కుదరకపోతే నాని సినిమాని జూలై 30న రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇంత షార్ట్ గ్యాప్ లో ‘టక్ జగదీష్’ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు అన్న విషయం పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: