తమిళనాట స్టార్ హీరోగా రోజురోజుకు ఎదుగుతూ తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్న హీరో ధనుష్. మంచి మంచి విజయాలతో వెరైటీ సినిమా ప్రయత్నాలతో తన ఫాలోయింగ్ క్రేజ్ ను పెంచుకుంటూ పోతుండగా ధనుష్ ఇప్పుడు తెలుగులో కూడా తన ప్రభంజనం సృష్టించడానికి వస్తున్నాడు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన హీరో గా నటించిన అసురన్, కర్ణన్ సినిమాలు సూపర్ హిట్ అందుకోగా ధనుష్ ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 

తమిళ సినిమా పరిశ్రమలో కి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రజనీకాంత్ అల్లుడుగా, ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. ధనుష్ తమిళ చలన చిత్ర నిర్మాత దర్శకుడు అయిన కస్తూరి రాజా కుమారుడే. సెల్వ రాఘవన్ ఇతని సోదరుడు. సెల్వరాఘవన్ ఓ దర్శకుడు. తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమా చేయగా తమిళంలో ధనుష్ హీరోగా ఇదే సినిమాను చేశాడు. నాటు సరుకు చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన ధనుష్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను అలరించాడు.

ఇక ఆయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమిళంలో ఏ హీరోకి సాధ్యం కానీ ఒక ఫీట్ ను సాధించారు. రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ సూర్య లాంటి ఏ స్టార్ హీరోలకు సాధ్యం కానీ ఈ ఘనతను ధనుష్ సాధించడంతో తమిళనాడులోని అభిమానులతా ఒక్కసారిగా ఖుషి అవుతున్నారు. తమిళ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ధనుష్ నిలవడం విశేషం. ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో ఈ దెబ్బతో నిరూపితమయింది. సోషల్ మీడియాలో ప్రధాన మాధ్యమం అయిన ట్విట్టర్లో ఆయనకు పది మిలియన్ ఫాలోవర్స్ దాటేశాడు. ఏకంగా కోటి మంది ఆయనను ఫాలో అవుతున్నారు అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: