టాలీవుడ్ సినీ పరిశ్రమను ఒకానొక సమయంలో స్టార్
హీరోయిన్ గా నెంబర్వన్
హీరోయిన్ గా ఏలిన
హీరోయిన్ వాణిశ్రీ. నలుపు రంగులో ఉన్న తనదైన నటనతో, తనదైన స్టైల్ తో, తనదైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈమె ఎంతో మంది తెలుగువారి ఆరాధ్య దేవత గా మారన
వాణిశ్రీ ఒక దశాబ్దం పాటు నెంబర్ వన్ కథానాయికగా ఓ వెలుగు వెలిగారు. టాప్ హీరోలు సైతం ఆమె కోసం వెయిట్ చేసే వారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె ను
హీరోయిన్ గా చంద్రమోహన్ పరిచయం చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రమోహన్ ఆ
సినిమా సమయంలో జరిగిన ఓ చిన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ద్వారా వెల్లడించారు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు అన వారి రూపాన్ని బట్టి వారిని అంచనా వేయకూడదని
వాణిశ్రీ ని చూసి నేర్చుకున్నాను అని వెల్లడించాడు. ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వం లో రంగుల రాట్నం సినిమాలో నాయికగా
వాణిశ్రీ ను ఎంచుకున్నారు. కానీ ఆ నిర్ణయం చంద్రమోహన్ కు నచ్చలేదు. ఆయన కంటికి
వాణిశ్రీ ఒక
జూనియర్ ఆర్టిస్టులా కనిపించిందని ఆమె వద్దని మరొకరిని తీసుకోమని సలహా ఇచ్చాడు చంద్రమోహన్ .
అప్పటిదాకా
వాణిశ్రీ కమెడియన్ వేషాలు చేసుకుంటూ వస్తుంది.
బాలకృష్ణ పక్కన, పద్మనాభం పక్కన
కామెడీ వేషాలు వేస్తోంది. హీరోగా ఇది నా మొదటి పిక్చర్ లో నా పక్కన ఈమె
హీరోయిన్ వద్దు అని చెప్పారట. కానీ బి.ఎన్.రెడ్డిగారు ఆమెను
హీరోయిన్ గా పెట్టుకునేందుకు చంద్రమోహన్ ను ఒప్పించారు. ఆ తర్వాత కానీ
వాణిశ్రీ విలువ ఏంటో చంద్రమోహన్ కి తెలియలేదట. బి.యన్.రెడ్డి చెప్పినట్లుగానే పది సంవత్సరాలు
వాణిశ్రీ టాప్
హీరోయిన్ గా వెలుగొందింది. ఎంతో అప్ కమింగ్ హీరోలు ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చునేవారు. అగ్ర హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం పడిగాపులు కాసే వారు అని
వాణిశ్రీ గొప్పతనాన్ని తెలియజేశారు చంద్రమోహన్.