నేచురల్ స్టార్ నాని సినిమాల విడుదలకి ఎప్పుడూ ఓ గండం ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఆయన సినిమా విడుదల అయ్యే టైంకి ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంది. అసలే వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నానికి రిలీజ్ సమస్య ఆయనను మరింత కృంగదీస్తుంది. గతంలో నాని హీరోగా నటించిన వి సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం ఉండగానే కరోనా మహమ్మారి ఒక్కసారిగా ప్రజలందరిని ఎంతో ఇబ్బంది పెట్టడంతో థియేటర్లు మూసివేయాల్సి వచ్చింది.

ఆ విధంగా రిలీజ్ ముంగిట వి సినిమా ఆపి వేశారు. నోట్లో కూడా లాక్కున్నట్లు కొన్ని రోజులలో విడుదల కాబోతున్న సినిమా ను విడుదల కాకుండా చేసింది కరోనా మహమ్మారి. దాంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా అక్కడ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యింది వి సినిమా.  దాంతో తన తదుపరి చిత్రాన్ని ఎన్ని కష్టాలు ఎదుర్కొని అయినా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని భావించాడు నాని.  ఆ విధంగా ఆయన తాజా చిత్రం టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధం చేశాడు. 

భారీ బడ్జెట్ తో కుటుంబకథా చిత్రంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను నాని రూపొందించగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయి ఇక సక్సెస్ కొట్టడమే తరువాయి అని అనుకున్నారు చిత్రబృదం.  కానీ రెండో వేవ్ కరోనా కారణంగా థియేటర్లను ఓపెన్ చేయలేదు. థియేటర్లు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నా 50 శాతం కెపాసిటీ మాత్రమే అని చెప్పడంతో నిర్మాతలు ఇప్పటివరకు తమ సినిమాలను విడుదల చేయలేదు. ఆ విధంగా నాని కూడా వెనుకడుగు వేయక తప్పలేదు. ఇప్పుడిప్పుడే థియేటర్లో తెరుచుకుంటాయి అన్న ఆశ చిగురించడం తో నాని ఈ నెల 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ నాని ఇంకెన్ని రోజులు వేచి చూసే ఆలోచనలో ఉన్నాడట. అందుకు కారణం కరోనా కాదు ఆంధ్రప్రదేశ్ లోని టికెట్ల రేట్లు. ఆ విషయంలో ప్రభుత్వం క్లారిటీ  ఇచ్చాక గానీ నానీ తన సినిమాను విడుదల చేయడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: