టాలీవుడ్ మాటల మాంత్రికుడు కి ఈ మధ్య టైం ఏమీ బాగా లేదు అనుకుంటా.. అలా వైకుంఠపురం లో లాంటి సూపర్ హిట్ ను అందించినా కూడా ఆయనకు తన తదుపరి
సినిమా ఓకే అవడంలో రోజురోజుకీ జాప్యం పెరుగుతోంది. ఇప్పటికే
ఎన్టీఆర్ తో
త్రివిక్రమ్ తన రెండో
సినిమా ను సెట్ చేసినా కూడా అది పట్టాలెక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఆ
సినిమా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్తున్నారు కానీ అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని
కొరటాల శివ తో, మహేష్ బాబుతో
త్రివిక్రమ్ తన నెక్స్ట్
సినిమా మొదలుపెట్టారు.
కానీ ఈ
సినిమా కూడా పట్టాలెక్కుతుందో లేదో అన్న సందేహం అందరికీ కలుగుతుంది. టాలీవుడ్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ లో వీరిద్దరి కాంబినేషన్ ఒకటి. గతంలో వీరిద్దరూ రెండు సినిమాలను చేయగా అవి ప్రేక్షకులను బాగానే అలరించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ
సినిమా గురించి వీరిద్దరూ అధికారికంగా ఎప్పుడూ నోరు విప్పలేదు. కనీసం ఒక పోస్ట్ కూడా చేయలేదు దీంతో వీరిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం నడుస్తుంది అన్న ప్రచారం జరుగుతుంది సినీవర్గాల్లో.
గత అనుభవాల దృష్ట్యా
సినిమా స్క్రిప్టు మొత్తం సిద్ధమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు మహేష్. అంతేకాకుండా ప్రొడక్షన్ విషయంలో తాను ఇన్వాల్వ్ కావాలని తన బ్యానర్ ఇన్వాల్వ్ కూడా ఉంటుందని చెప్పడంతో ఈ
సినిమా దీనికి
నిర్మాత చిన్నబాబు ఒప్పుకోవడం లేదని దాంతో ఈ
సినిమా పట్టాలెక్కలేదు అని త్రివిక్రం అభిమానులు భయపడుతున్నారు. అనిల్ రావిపూడి కూడా మహేష్ బాబుతో మరో
సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ
సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నాడు. మరి దీన్ని జాగ్రత్తగా సరి చూసుకోకపోతే
త్రివిక్రమ్ కు ఈ
సినిమా కూడా క్యాన్సిల్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.