తొలి సినిమాతోనే టాలీవుడ్ ను షేక్ చేసిన సినిమా చేశాడు సందీప్ రెడ్డి వంగ.  ఆయన దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ సినిమా చరిత్రలో మిగిలిపోయింది. ఈ సినిమా టాలీవుడ్ లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమకు మరో స్టార్ హీరోను అందించిన సందీప్ రెడ్డి ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా నీ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా రికార్డులు సృష్టించాడు.

షాహిద్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రాన్ని కూడా బాలీవుడ్ లోనే చేస్తు ఉండడం విశేషం. రణభీర్ కపూర్ హీరోగా యనిమల్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు సందీప్ రెడ్డి.  అయితే తెలుగులో మహేష్ బాబు తో డెవిల్ అనే సినిమా చేస్తున్నాడు అని గతంలో వార్తలు రాగా అవి నిజం కాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ విజయ్ దేవరకొండ తోనే సినిమా అని ప్రచారం జరిగినా అది కూడా జరగలేదు. ప్రస్తుతం ఆయన పవన్ నీ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. 

ఇటీవలే ఆయన తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమా జానీ, ఖుషీ గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. ఇందులో ఒక పెప్సీ యాడ్ ఫోటోను కథ చేశాడు. కానీ సినిమా ఆడియో సిడీని ఖుషీ ఆడియో సిడీని కూడా ఉంచి ఆ రోజుల్లో పాటలు వినడం అంటే ఎంతో ఇష్టమని, పవన్ కళ్యాణ్ పాటలు అంటే ఇష్టం అని, పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఎంతో ఇష్టమని చెప్పాడు. ఇది తన జ్ఞాపకాల బంగారు నిధి అని ట్యాగ్ లైన్ అని కూడా ఇచ్చాడు. ఇది పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే అని కొంతమంది సినిమా విశ్లేషకులు అంటున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు లో తాను చేయబోయే సినిమా స్టార్ తో ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ సెట్ చేసే విధంగా ఆయన ఈ విధంగా పోస్ట్ చేశాడు అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: