కరోనా లాక్ డౌన్ సమయంలో లక్షల మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. డబ్బులుండి సాయం చేయలేని ఎంతో మంది వ్యాపారస్తుల కన్నా ఆయన గ్రేట్ అని నిరూపించుకున్నారు. లాక్ డౌన్ మొదలైన నుంచి తనను సాయమని అర్థించిన చాలా మందికి తనకు తోచిన విధంగా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇలా తాను చేసిన సాయాలతో దేశవ్యాప్తంగా సోనూసూద్ విశేష ఆదరణ పొందాడు. సోనూ చేస్తున్న సేవలను చూసి చాలా మంది ఆయన అభిమానులుగా మారిపోయారు.


ప్రస్తుతం ఈ రియల్ హీరో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే దానకర్ణుడు సోనూసూద్ రోటీలు చేసి అమ్ముతూ ఉన్నాడు. సోనూ సూద్ ఏంటి రోటీలు చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా! అవును అతడు ఓ పంజాబీ దాబాను ఓపెన్ చేసి మరీ రోటీలు అమ్ముతున్నాడు. కానీ ఈ పనిని కూడా సోనూ తన స్వార్థం కోసం స్వలాభం కోసం చేయలేదు. పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్న చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసమే చేశాడు. చాలా మంది సెలబ్రెటీలు తమ ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లలో కార్పోరేట్ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ... లక్షల్లో వెనకేసుకుంటున్న ఈ రోజుల్లో ఎటువంటి లాభం ఆశించకుండా చిరు వ్యాపారుల వ్యాపారాలను ప్రమోట్ చేయడం గొప్ప విషయం.


ఇలా సోనూ రోటీలు చేస్తూ ట్విటర్ లో విడుదల చేసిన వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆయన చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. సోనూ చేసిన ప్రయత్నానికి తమ వంతుగా సాయం తప్పకుండా అందిస్తామని అంటున్నారు. సోనూసూద్ ఇలా వ్యాపారులను ప్రోత్సహిస్తూ వీడియోలు చేయడం ఇది మొదటి సారేం కాదు. ఇది వరకు కూడా ఆయన సూపర్ మార్కెట్ లో పనిచేసే వ్యక్తిలా సామగ్రి రేట్లు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: