ఉత్తమ నటుడిగా 2 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుష్ నటనా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పలు అద్భుతమైన చిత్రాలతో భారత దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈరోజు ధనుష్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించిన అద్భుతమైన చిత్రాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం, పదండి.

1. కాదల్ కొండేయిన్:

కాదల్ కొండేయిన్ అనేది సెల్వరాఘవన్ రూపొందించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. ఈ సినిమాలోని ధనుష్ నటనకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా ఫిదా అయిపోయారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన "నేను" సినిమాకి కాదల్ కొండేయిన్ మాతృక. అయితే ధనుష్ కి ఇది రెండవ సినిమానే. అయినప్పటికీ ఆయన అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఒక అమాయకుడిగా, ఒక సైకో లాగా ధనుష్ చూపించిన నటన అప్పట్లో ఒక సంచలం అయ్యింది. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

2. పుదుపెట్టయ్:

కల్ట్ క్లాసిక్ మూవీ "పుదుపెట్టయ్" సినిమాలో ధనుష్ నటన ప్రదర్శన అబ్బురపరిచింది. కత్తి పట్టుకుని అతడు చేసిన ఫైట్లు ఒళ్ళు గగుర్పొడిచేలా చేసాయి. ఒక భయస్తుడిగా, ధైర్యవంతుడిగా, క్రూరుడిగా, ఫ్యామిలీమ్యాన్ గా ఇలా చెప్పుకుంటూపోతే ఒకే సినిమాలో ఆయన ఎన్నో షేడ్స్ చక్కగా చూపించారు. ఈ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా.. చూడాలనిపించే ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి.

3. పొల్లధవన్:

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన పొల్లధవన్ లో మిడిల్ క్లాస్ యువకుడిగా ధనుష్ అద్భుతంగా పెరఫార్మ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమా గా రీమేక్ చేశారు. పొల్లధవన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అలరించింది. జీ.వీ ప్రకాష్ అందించిన సంగీతం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం కూడా ధనుష్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.


4. రాంజానా:

ఇంటెన్సివ్ రొమాంటిక్ డ్రామా రాంజానా సినిమాతో ధనుష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది ధనుష్ కి మొదటి బాలీవుడ్ చిత్రం. ధనుష్ తన డెబ్ల్యూ సినిమాతోనే హిందీ ప్రేక్షకులను బాగా అలరించారు. ఇది ప్రతి ధనుష్ అభిమాని చూడాల్సిన సినిమా. ఈ చిత్రంలో ధనుష్, స్వరభాస్కర్ కనబరిచిన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.

ఇక కర్ణన్, ఆడుకాలం, అసురన్, వడ చెన్నై, రఘువరన్ బీటెక్, కోడి వంటి ఎన్నో చిత్రాలు ఆయన్ని మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: