ప్రస్తుతం
టాలీవుడ్ లో వరుస సినిమాలు
రీమేక్ అవుతుండడం ఒకసారిగా అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపుగా
టాలీవుడ్ ఓన్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. హీరోలు కూడా అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు కానీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్క
హీరో కూడా వరసగా
రీమేక్ సినిమాలు చేస్తూ ఉండడం అందరినీ ఒక సారిగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోల దాకా చాలా మంది హీరోలు ప్రస్తుతం
రీమేక్ సినిమాలను చేస్తూ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే పవన్
కళ్యాణ్ కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషీయం అనే
రీమేక్ సినిమాలో చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా సార్లు
రీమేక్ సినిమాలు చేసిన పవన్
తను ముహూర్తం పెట్టిన వేదాలం సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయాడు. ఆ సినిమాను
మెగాస్టార్ చిరంజీవి చేస్తుండడం కొసమెరుపు. ఎన్నికలకు ముందు పవన్
కళ్యాణ్ నీసన్ దర్శకత్వంలో ఏఏం రత్నం నిర్మాతగా ఈ
సినిమా చేయాలని పూజ కార్యక్రమాలు కూడా చేశారు.
కానీ ఆ తర్వాత ఎన్నికలు రావడం పవన్
కళ్యాణ్ సినిమాలకు దూరమవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దాంతో ఈ
సినిమా కూడా తెరకెక్కడం కష్టం అయింది. ఎన్నికల తర్వాత పవన్
కళ్యాణ్ చేద్దామనుకున్నా ఎన్నికల సమయంలో పవన్
కళ్యాణ్ సినిమాలు చేయవద్దు అని నిర్ణయించుకోగా ఈ
సినిమా ను పక్కన పెట్టేశారు అందరూ. ఈ వేదా లం
సినిమా ను
చిరంజీవి చేస్తుండగా పవన్
కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే
చిరంజీవి సినిమాలు చేస్తుండడంతో పవన్
కళ్యాణ్ వేరే సినిమాలకు వెళ్లిపోయాడు. అలా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదలాం సినిమాను పవన్
కళ్యాణ్ చేజేతుల చేజార్చుకున్నాడు.