ఇక అప్పుడు ఎయిర్ టెల్ అంటే ఆ అమ్మాయి పేరు గుర్తుకు వచ్చేంతలా పాపులర్ అయ్యింది. సాదారణంగా ఒక మోడల్ ఒక సంవత్సరం లేదా రెండేళ్ల పాటు ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా పని చేస్తారు. కాని సాషా మాత్రం ఎయిర్ టెల్ కంపెనీకి సుదీర్ఘ కాలం పాటు బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యటం వల్ల అందరిలో ఆమె బాగా నోటెడ్ అయ్యింది. ఒక హీరోయిన్ కు ఎంత పెద్ద గుర్తింపు లభిస్తుందో సాషా కు కూడా అంతటి పెద్ద గుర్తింపు దక్కింది. అన్ని భాషల ప్రేక్షకులు కూడా సాషా ను గుర్తించే రేంజ్ కు దూసుకువెళ్లింది. ఇక అప్పట్లోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ అన్నట్లుగా పేరు దక్కించుకుంది. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న సాషా సినిమాల్లో కూడా నటించేందుకు రెడీ అయ్యింది. అయితే ఎయిర్ టెల్ యాడ్ కు వచ్చినంత గుర్తింపు మాత్రం సినిమాల ద్వారా ఆమెకు రాలేదు.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో హీరోయిన్ గా సాషా నటించడం జరిగింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడటంతో సాషా కు మళ్లీ సినిమాల్లో ఆఫర్లు అనేవి రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో వచ్చినా కూడా మరీ చిన్నా చితక సినిమాలు అవ్వడం వల్ల ఆమె ఆసక్తి చూపించలేదు.ఇక చాలా గ్యాప్ తర్వాత సాషా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.అయితే ప్రభాస్ సరసన రొమాన్స్ చేసే మెయిన్ హీరోయిన్ గా కాదు. రాధే శ్యాం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది.ఇక ఈ సినిమా కథలో చాలా కీలకమైన పాత్ర ఈ పొట్టి పిల్లదే అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈమె పాత్ర చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందంటూ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమా పైనే ఈ పొట్టి పిల్ల అనేక రకాలుగా ఆశలు పెట్టుకుంది. ఇక తన ఆశలు ఈమె పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: