టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా తదుపరి షెడ్యూల్ ని అతి త్వరలో గోవా లో నిర్వహించనున్నారు యూనిట్ సభ్యులు. మహేష్ కెరీర్ లో ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, ఫస్ట్ నోటీస్ పోస్టర్ రెండూ కూడా ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరచగా, నేడు మహేష్ బాబు 46వ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన బ్లాస్టర్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ సినిమాపై తారా స్థాయికి అంచనాలు పెంచింది.
ఇక  నేడు మహేష్ బర్త్ డే కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు ఎందరో ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు చాలామంది సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం సూపర్ స్టార్ కి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ కి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియచేసారు.
'హ్యాపీ బర్త్ డే టూ ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నిజమైన స్టైల్ మరియు ట్రెండ్ కలగలిసిన వ్యక్తి మీరు, ఈ ఏడాది మీకు అన్నివిధాలా మంచి జరగాలి, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మొదటి నుండి కృష్ణ, మహేష్ లతో మంచి అనుబంధం కలిగిన మెగాస్టార్, మహేష్ గురించి ఇంత గొప్పగా ట్వీట్ చేయడం ఒకింత షాకింగ్ విషయం అని, ఈ ట్వీట్ తో మెగాస్టార్ యొక్క గొప్ప వ్యక్తిత్వం అర్ధం అవుతోంది అంటూ పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మెగాస్టార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు .... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: