
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. కొమరం భీమ్ గా రామ్ చరణ్ తో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఉన్నాడు ఎన్టీఆర్. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ లు సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేశాయి. ఇటీవల కీరవాణి సంగీత సారథ్యంలో ఓ పాట విడుదల కాగా దానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా వరుస భారీ సినిమాలను సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో ని సినిమా. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు మాస్ మసాలా చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఒక్క ఫ్లాప్ లేకుండా భారీ విజయాలను అందుకున్నాడు. కొరటాల శివ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా పూర్తయింది. మెగాస్టార్ తో తొలిసారి చేస్తున్న ఈ సినిమా మర్చిపోలేని సినిమాగా మిగిలిపోవాలని ఓ అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు కొరటాల శివ.
త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేతులు కలిపబోతున్నాడు కొరటాల శివ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రాగా ఇప్పుడు అంతకుమించి ఉండేలా సినిమా చేయబోతున్నాడు కొరటాల శివ. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో భూమిక నటిస్తుండగా హీరోయిన్ గా త్రిష ను పరిశీలన చేస్తున్నారట. దీంతో యంగ్ టైగర్ అభిమానులు ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇంతమంది ఉండగా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో త్రిషతో దమ్ము అనే సినిమా చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం అంటే ఆమెకు మంచి అవకాశమే అని చెప్పాలి.