ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్క హీరో అదే విధంగా సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్  ఓ నాలుగు సినిమాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తుండగా ఇతర యంగ్ స్టార్ హీరో లు కూడా అదేవిధంగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. దేశం మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ తన తదుపరి సినిమాలను భారీ రేంజ్లో తెరకెక్కేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా భారీ సినిమాలను చేయడానికి దర్శకుడు ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

రామ్చరణ్ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్ ల తన పాన్ ఇండియా కెరీర్ ను సెట్ చేసుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తున్నాడు. టాలీవుడ్ పరంగా ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే ఉంది కానీ ఇండియా లెవల్లో అంతగా లేదని చెప్పాలి. దానికి కారణం దర్శకుడుకి హీరో కి పాన్ ఇండియా ఇమేజ్ లేకపోవడమే. దాంతో సినిమాల్లోకి ముందుగా వచ్చినా కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ లా పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకోలేక పోతున్నాడు అనే రీమేక్ ఏర్పడుతుంది. ఈ సినిమా తర్వాత భారీ దర్శకుడితో సినిమాను అల్లు అర్జున్ అనౌన్స్ చేస్తాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: