ప్రస్తుతం సినిమాలకు ఊపిరి వచ్చింది. థియేటర్లలో వరుసగా సినిమాలు అన్నీ విడుదల కావడంతో థియేటర్లు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి. వరుసగా మూడవ వారం సినిమాలు ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రాగా క్రమక్రమంగా థియేటర్లకు వచ్చి సినిమాను తిలకించే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. రాబోయే వారాలలో హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించి సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం లో కొంత సఫలీకృతం అయిందని చెప్పవచ్చు.

ఈ వారం కూడా ఒరేయ్ బామ్మర్ది, పాగల్ సినిమా థియేటర్లలో రాగా ఆ సినిమాలను కూడా బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఆగస్టు 27వ తేదీన చాలా సినిమాలు విడుదల చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాలు విడుదల  కావడానికి రెడీగా ఉన్నాయి. వచ్చేవారం శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్, శ్రీ విష్ణు మేఘ ఆకాష్ నటించిన రాజ రాజ చోర అలాగే కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 27వ తేదీన సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ జానపద పాట విడుదల కాగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరుచుకుంది.

అలాగే అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను విడుదల చేయనున్నాడు. ఇది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బాల చిత్రానికి రీమేక్.  సుశాంత్ నటిస్తున్న ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా కొంత కాంపిటేషన్ టాలీవుడ్ కు ఎదురవుతుంది. అమితాబ్ నటించిన చహరే సినిమా కూడా హైదరాబాద్ మల్టీప్లెక్స్ లలో సందడి చేయనుంది. మరి ఏ విధంగా ఇవి ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: