సహాయక నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఆ తర్వాత కమెడీయన్ గా ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు హీరోగా దర్శకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అవసరాని కి తగ్గట్టు గా అవసరాల శ్రీనివాస్ హీరోగా దర్శకుడిగా కమెడియన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలలో హీరోగా చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను అలరించనుడడంతో ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో మెగాఫోన్ పట్టుకుని ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయనకు సరైన సక్సెస్ రాకపోవడంతో మళ్ళీ నటన వైపు అడుగులు వేసాడు. ఆ విధంగా ఆయన బాలీవుడ్ లో తెరకెక్కిన హంటర్ సినిమాను తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో రీమేక్ చేసి మంచి పేరు దక్కించుకున్నాడు. దాంతో ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాను నూటొక్క జిల్లాల అందగాడు పేరుతో రీమేక్ చేసి మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు.

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన బాల అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. బట్టతల వల్ల సొసైటీలో హీరో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. దానివల్ల ఆయన జీవితంలో ఎలాంటి స్థితిలో కి వెళ్ళాడు. ఎలా జీవితంలో పైకి ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. మెసేజ్ ఓరియెంటెడ్ గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అని భావిస్తుంది చిత్ర బృందం. మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయితే అవసరాల శ్రీనివాస్ ఇక వరుసగా హీరోగా మాత్రమే సినిమాలు చేస్తడు కాబోలు. ఏదేమైనా హీరోగా బాగా సెటిల్ అయ్యే ప్రయత్నంలో అవసరాల బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: