అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ ఫైనల్ ఈ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సీజన్ లో ఉత్తరాఖండ్ కు చెందిన గాయకుడు పవన్ డీప్ రాజన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. 12వ సీజన్ కు సంబంధించి ఫైనల్ ను నిర్వాహకులు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేయగా ఈ గ్రాండ్ ఫైనల్ ను 12 గంటల పాటు ప్రసారం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 వరకు ఈ ఫైనల్ కొనసాగింది. ఈ ఫైనల్లో పవన్ దీప్ రాజన్ తో పాటు తెలుగమ్మాయి షణ్ముఖప్రియ అలాగే కొల్ కతా కు చెందిన అరునిత, మంగళూరుకు చెందిన నిహాల్,  మహారాష్ట్రకు చెందిన సెళ్ళీ, ఢిల్లీకి చెందిన మహమ్మద్ ధనిష టైటిల్  కోసం ఎంతగానో పోటీపడ్డారు.

ఈ కార్యక్రమానికి ఆదిత్య నారాయణ్ హోస్ట్ గా ఉండగా హిమేష్ రేష్మియ, అను మాలిక్, సోను కక్కర్ జడ్జ్ లు గా ఉన్నారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ మల్హోత్రా, కీయరా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఫైనల్ ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు ఫైనలిస్టు లు కూడా ఫైనల్ వేదికపై అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. అయితే చివరకు టైటిల్ ను పవన్ కు వరించింది. ఆయనకు 25 లక్షల క్యాష్ ప్రైజ్, మారుతీ స్విఫ్ట్ కారు అందజేశారు. ఆరునిత, సైలి ఫస్ట్ సెకండ్ రన్నరప్ నిలిచారు. ఆరో స్థానంలో నిలిచింది విశాఖపట్నంకు చెందిన షణ్ముఖ ప్రియ.

తెలుగు బిడ్డ షణ్ముఖ ఫైనల్ లో నిలవడంతో తెలుగు రాష్ట్రాల సంగీత ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ షో ను వీక్షించారు. అయితే వారికి చివరికి నిరాశే ఎదురయింది. ఫైనల్లో ఐదుగురు తో పోటీ పడిన షణ్ముఖ ఆరో స్థానం సరిపెట్టుకుంది. షో ఆద్యంతం తన గొప్ప ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించింది. మొత్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీంతో ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ లాంటి వారు ఆమెకు సపోర్ట్ చేయగా ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: