
ఆ తర్వాత బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది. జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతగానో గుర్తింపు సంపాదించింది. దీంతో అటు వెండి తెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంది అనసూయ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కేవలం వైవిధ్యమైన పాత్రలు మాత్రమే కాదు అటు ఏకంగా కొన్ని సినిమాల్లో ఐటం సాంగ్స్ కూడా చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది అనసూయ. ఎప్పుడు కూల్ గా నవ్వుతూ ఉండే అనసూయ మరోవైపు తనపై బ్యాడ్ కామెంట్ చేసిన వారిపై విరుచుకు పడుతూనే ఉంటుంది. ఇకపోతే ఇటీవలే అనసూయ హైట్ పై హైపర్ ఆది కామెంట్ చేశాడు.
ఈ కామెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది స్కిట్ వస్తుంది. ఈ క్రమంలోనే కాలేజీ అమ్మాయిలాగా బుక్స్ పట్టుకొని స్టేజి మీద నిలబడుతుంది అనసూయ పక్కనే ఉన్న హైపర్ ఆది కాలేజీలో జాయిన్ అయ్యారు కదా మీ గోల్ ఏంటీ అని అడుగుతాడు. బాగా చదివి ఇంకా ఎత్తుకు ఎదగాలి అని చెబుతుంది అనసూయ. ఇప్పటికే చాలా హైట్ ఉన్నారు ఇంకా ఎత్తుకి ఎదిగి కాలేజీ కి పెయింట్ వేస్తారా ఏంటి అంటూ కామెంట్ చేస్తాడు ఆది. దీంతో అనసూయ షాక్ అవుతుంది.