ఈ పరిస్థితులు ఇలా ఉంటే నిన్న విడుదల చేసిన ‘ది ఘోస్ట్’ మూవీ ఫస్ట్ లుక్ మీడియాకు వైరల్ గా మారింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది అని అంటున్నారు. డిఫరెంట్ సినిమాలకు చిరునామాగా నిలిచే నాగార్జున ఈమూవీలో కూడ తన ప్రత్యేకమైన అభిరుచిని చాటుకున్నాడు.
రక్తం కారుతున్న కత్తి పట్టుకుని నాగార్జున నిలబడితే విదేశీ జనాలు అంతా అతని ముందు మోకరిల్లి కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ ను చూసినవారికి ఈమూవీలో నాగార్జున మాఫియా డాన్ గా కనిపిస్తాడా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రవీణ్ సత్తార్ స్టైల్ లో పక్కా హాలీవుడ్ స్టైల్ కు టాలీవుడ్ మాస్ అభిరుచులను మిక్స్ చేసి ఈ కథను డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది.
ప్రస్తుతం నాగార్జున ‘బిగ్ బాస్ సీజన్ 5’ ను హోస్ట్ చేస్తూనే ‘బంగార్రాజు’ ‘ది ఘోస్ట్’ సినిమాలలో నటిస్తూ ఈ రెండు సినిమాల షూట్ ని పరుగులు తీయిస్తున్నాడు. సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్ సీజన్ 5’ ఓపెనింగ్ డే కార్యక్రమాన్ని చాల డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ఆలోచనలలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన నాగ్ పుట్టినరోజునాడు ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇవ్వన్నీ ఒక ఎత్తైతే సమంత నాగార్జున ను ఆకాశానికి ఎత్తేస్తూ చేసిన ట్విట్ చదివిన వారికి ఈమధ్య కాలంలో ఆమె పై వస్తున్న వార్తలు అన్నీ గాలి వార్తలు మాత్రమే అన్న క్లారిటీ వస్తుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి