రమ్యకృష్ణ టాలీవుడ్ లేడీ లెజెండ్. ఒకప్పుడు గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈమె అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు యూత్ ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చుకుంది. అందం, అభినయమే కాదు రాజసం ఉట్టిపడే నటన ఆమె సొంతం. "భలే మిత్రులు" చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ వన్నె తరగని అందంతో, అబ్బుర పరిచే నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. నరసింహ చిత్రంలో ఈమె నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు.

ఈ మూవీలో నీలాంబరిగా ఆమె నటన ఓ అద్భుతం. సూపర్ స్టార్ రజిని కాంత్ కి పోటా పోటీగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న గొప్ప నటిగా గుర్తింపు పొందింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి మూడుపదుల సంవత్సరాలు దాటినా ఇప్పటికీ సినిమాలలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ అందరితో భళా అనిపించుకుంటున్నారు. బాహుబలి చిత్రంలో తన నటనతో అంతర్జాతీయ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుని  పేరు ప్రఖ్యాతులు పొందారు.  శివగామి పాత్రకు రమ్య కృష్ణ తప్ప ఇంకెవరూ నూటికి నూరుపాళ్లు న్యాయం చేయలేరేమో అన్నట్టుగా అలరించింది.

పేరుకి తమిళమ్మాయి అయినా టాలీవుడ్ హీరోయిన్ గా పాతుకుపోయింది. హీరోయిన్ గా, విలన్ గా, తల్లిగా ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర ప్రేక్షకుల్లో చిరస్థాయిగా గుర్తుండేలా చేసే మ్యాజిక్ ఆమె  సొంతం. ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్ర చేయాలి అంటే మొదటి ఆప్షన్ రమ్య కృష్ణనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతగా తన నటనతో, రాజసం ఉట్టిపడే అందంతో మూడు దశాబ్దాల నుండి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు రమ్య కృష్ణ. ఇప్పటికీ ఈమె నటన చూసి ప్రత్యేక పాత్రలు సృష్టిస్తున్నారు దర్శకులు. ఈమె ఈరోజు తన 54 వ వసంతంలోకి అడుగు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: