అందానికి అందం, అభినయానికి అభినయం, మేధస్సుకు మేధస్సు అన్ని కలగలిపిన ఆడవారు చాలా తక్కువగా ఉంటారు అని అంటూ ఉంటారు. ఆ విధంగా సినీ నటి గా, రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్రను వేసింది  ప్రేక్షకులపై హీరోయిన్ నగ్మా. నందితా అరవింద్ మొరార్జీ అనే పేరుతో చిన్నతనం గడిపిన ఈమె తెలుగు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించి తన పేరు మార్చుకుంది. ఘరానా మొగుడు సినిమా తో తెలుగులో, భాషా తో తమిళంలో గొప్ప గుర్తింపు పొందింది.

బాలీవుడ్ లో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన కూడా ఈమె ఎక్కువగా నటించింది సౌత్ సినిమాలలోనే.. మలయాళ కన్నడ బెంగాలీ భోజ్ పురి, పంజాబీ మరాఠీ భాషల చిత్రాల్లో కూడా నటించి ఆమె అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. భాగీ సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఈమె మొదటి సినిమా సల్మాన్ ఖాన్ సరసన చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక బాలీవుడ్ సూపర్ హిట్ సూహాగ్ చిత్రంలో కూడా ఈమె కీలక పాత్రలో నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

అప్పటికే ఆమె మంచి స్నేహితురాలు నటీమణి దివ్యభారతి సలహామేరకు దక్షిణాదిన వెళ్లి అక్కడ తెలుగు తమిళ భాషలలో నటించడం మొదలు పెట్టింది నగ్మా. అలా చిరంజీవి తో ఘరానా మొగుడు అక్కినేని నాగార్జున తో అల్లరి అల్లుడు సినిమా లు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2006 సంవత్సరంలో ఆమె పంజాబీ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి తో రాజ్ బబ్బర్ కలిసి ఓ సినిమాలో చేసింది. అలా క్రమక్రమంగా సినిమాలకు దూరం అయిపోయిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించినది. మొదట జాతీయ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన ఈమె న్యూఢిల్లీలోని ఆ పార్టీలో చేరింది. ఆ తర్వాత హైదరాబాద్ లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసింది. రాజీవ్ గాంధీ ను పోగడదానికే కాంగ్రెస్ పార్టీలోకి చేరానని మొట్టమొదటి గా సహాయాన్ని అందించానని ఆమె తెలిపింది. ఈమె తల్లి ముస్లిం తండ్రి హిందూ అని అన్ని మతాల తాము గౌరవిస్తామని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: