టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 5 కమెడియన్స్ అంటే ఆ లిస్ట్ లో వెన్నెల కిశోర్ పేరు ఉండనే ఉంటుంది. అంతగా తన టైమింగ్ తో అదిరిపోయే పంచ్ లతో, సహజంగా కనబరిచే అతడి నటన తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హాస్య ఆణిముత్యం వెండి తెరపై కనిపించడం వెనక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఈయన అమెరికాలో ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినా, సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువ ఎక్కువ. వెన్నెల సినిమాకి పనిచేయడానికి సహాయకులు కావాలి అన్న ప్రకటన చూసి దర్శకుడు దేవ కట్టా వెన్నెల సినిమా చేస్తున్నప్పుడు ఆయన వద్ద సహాయకుడిగా పనిచేయడానికి అవకాశం దొరకడంతో వెళ్లారు. కానీ ఆ మూవీలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డికి వీసా రాకపోవడంతో ఆ పాత్ర కిషోర్ చేయాల్సి వచ్చింది. అలా ఆ రోజు జరగబట్టే వెన్నెల కిషోర్ నేడు టాప్ కమెడియన్ గా మన ముందు నిలబడ్డారు. 

ఈయన అసలు పేరు బొక్కల కిషోర్ అయితే వెన్నెల సినిమా తరవాత తన ఇంటి పేరును  వెన్నెల కిషోర్ గా మార్చుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ చిత్రంలో కూడా వెన్నెల కిషోర్ కు అవకాశం వచ్చిందట, కానీ తను పనిచేస్తున్న కంపెనీలో సెలవులు ఇవ్వకపోవడంతో ఆ సినిమా ఛాన్స్ ను వదులుకున్నారట. ఆ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు కారణంగా మూడేళ్లు ఉద్యోగం చేసి వాటి నుండి బయటపడ్డాక  మళ్ళీ "ఇందుమతి" చిత్రంతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి  నేడు  తెలుగువారు గర్వించదగ్గ నటుడిగా కీర్తి ప్రతిష్టలు సాధించారు.  బిందాస్, ఇంకోసారి, ప్రస్థానం, ఆరెంజ్, ఏమైంది ఈవేళ, సీమ టపాకాయ్, జులాయి ఇలా వరుస పెట్టి చిత్రాలలో నటించారు వెన్నెల కిషోర్. డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉండడంతో వెన్నెల 1 1/2,  జఫ్ఫా చిత్రాలకు  దర్శకత్వం వహించారు. 

కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో డైరెక్టర్ గా కలిసి రాలేదని హాస్య నటుడిగా కెరియర్ ని కొనసాగిస్తున్నారు. 2005 లో తెలుగు తెరకు పరిచయమయిన ఈ హాస్య రత్నం వందలో ఒకడిగా కాకుండా వందలో ఒకరిగా ఉండాలన్న సామెతకు నిదర్శనంగా మారి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. 16 ఏళ్ల తన సినీ జీవిత ప్రయాణంలో 100 కు పైగా చిత్రాలలో హాస్య నటుడిగా నటించి మన్నలను అందుకుని నేటికి నంబర్ వన్ కమెడియన్ గా కొనసాగుతున్నారు వెన్నెల కిషోర్. అంతేకాదు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ను రీప్లేస్ చేసిన గొప్ప కమెడియన్ అని ప్రేక్షకులు వెన్నెల కిషోర్ ని ప్రశంసిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: