తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా గొప్ప నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు బ్రహ్మాజీ. తన మొదటి సినిమా నుంచి విభిన్నమైన చిత్రాలలో మంచి మంచి పాత్రలను పోషిస్తూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరం సినిమాతో హీరోగా పరిచయం అయిన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించే పాత్రలను పోషించి విలక్షణ నటుడిగా గొప్ప పేరును పొందాడు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బ్రహ్మాజీ చదువుకునే రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని గా ఉంటూ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాల్లోకి రావాలని కలలు కనేవాడు. కృష్ణ నటించిన ఏ సినిమా విడుదలైన నాలుగైదు సార్లు చూసే వాడు. ఆ విధంగా ఆయన శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులు గారికి రెవెన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తను కూడా సినీ నటుడు కావాలని స్ఫూర్తిని పొందాడు. అలా నటుడు కావాలని ఆసక్తితో ఫిలిం ఇనిస్టిట్యూట్లో చేరి రెండేళ్ల కోర్సు పూర్తిచేసి సినిమాలలో నటించడానికి సిద్ధం అయ్యాడు. 

ఆ సమయంలోనే కృష్ణవంశీ తో పరిచయం అయ్యింది.  ఇద్దరు రూమ్మెట్లు గా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకుడు అయిన తరువాత ఆయనను తన సినిమాలలో పెట్టుకుని ప్రోత్సహించాడు. ఆ విధంగా నిన్నే పెళ్ళాడుతా సినిమా విజయవంతం అయిన తర్వాత ఆయన్ని కథానాయకుడిగా పెట్టి సింధూరం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పెద్ద హీరోల సినిమాలకు సహాయ పాత్రలు అంటే మొదట అందరికీ బ్రహ్మాజీ నే గుర్తుకు వస్తాడు. అంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఈ నటుడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే సిద్ధాంతాలను పాటిస్తూ బ్రహ్మజీ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా క్రమశిక్షణతో మెదులుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ తన స్టార్డమ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: