టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా విషయం మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే బుల్లి తెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అమృత అభిమానులను అలరిస్తున్న కింగ్ నాగార్జున దీనితో పాటు పాటు సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కు జంటగా రమ్యకృష్ణ నటిస్తోంది, ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ప్రముఖ పాత్ర లో కనిపించబోతున్నాడు, నాగ చైతన్య కు జంటగా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఈ సినిమా తో పాటు గరుడ వేగ సినిమా తో మంచి విజయం అందుకొని టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను  చిత్ర బృందం విడుదల చేయగా, ఈ పోస్టర్ కు జనాల నుండి మంచి స్పందన రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెంచాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది, ఈ సినిమాలో అక్కినేని అఖిల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు అ ని వార్తలు వస్తున్నాయి. అయితే అక్కినేని అఖిల్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త పై చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: