‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొకవైపు ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పనులు పరుగులు తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ నిడివి కి సంబంధించిన ఒక వార్త ఈ మూవీ బయ్యర్లను ఖంగారు పెడుతున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీ నిడివి 2గంటల 45 నిముషాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరం ప్రేక్షకులు భారీ నిడివితో గల సినిమాలను చూడటానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు. దీనితో ఈ మూవీ నిడివిని 2 గంటల 30 నిముషాలకు కుదించమని ఈమూవీ బయ్యర్లు రాజమౌళికి చెపుతున్నప్పటికీ జక్కన్న వారి కోరికను తీర్చలేని పరిస్థితి అని అంటున్నారు.


ఈసినిమా నిడివి సమస్య గురించి తెలుసుకున్న కొందరు బయ్యర్లు జక్కన్నతో మాట్లాడినప్పుడు ఆయన చెపుతున్న కారణం వేరుగా ఉంది అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ ట్విస్ట్ లోని యాక్షన్ సీన్స్ 15 నిముషాలు ఉంటాయని అదేవిధంగా ఈమూవీ క్లైమాక్స్ 30 నిముషాలు భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉండటంతో ఈమూవీ నిడివి పెరిగింది అన్న బాధ సగటు ప్రేక్షకుడుకి ఉండదు అని రాజమౌళి చెపుతున్నట్లు తెలుస్తోంది.


దీనితో ఈమూవీ బయ్యర్లు రాజమౌళి మాటను కాదనలేక అదేవిధంగా ఈమూవీ నిడివి సమస్య గురించి భయం వదలక తెగ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈమూవీ స్వాతంత్రోద్యమ నేపధ్యంలో జరిగే కథ కాబట్టి దేశభక్తి చుట్టూ అల్లబడిన ఈ కథ ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు అర్థం అవుతుంది అన్న భయాలు కూడ బయ్యర్లకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రెట్ల పెంపు విషయంలో ఇంకా పట్టు కొనసాగిస్తున్న పరిస్థితులలో ఎప్పటికి పెద్ద సినిమాలకు లైన్ క్లియర్ అవుతుందో తెలియక చాలామంది బయ్యర్లు ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: