ఇటీవలే కాలంలో హీరోయిన్ లు గా రాణించాలనుకునేవారు కొంచెం టాలెంట్, ఎక్కువ గ్లామర్ చూపి స్తే చాలు వారికి అవకాశాలు కోకొల్లలు వస్తున్నాయి. ఇప్పుడు టాప్ హీరోయిన్ లుగా ఉన్నవారికి మంచి టాలెంట్ ఉన్నా కూడా వారు గ్లామర్ తోనే ఎక్కువగా ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తమ అందచందాలతో ప్రేక్షకులను మైమరిపించి లేత సోయగాలతో వారికి గాలం వేసి సినిమా అవకాశాలను రాబడుతున్నారు. ఏదేమైనా ప్రేక్షకుల పల్స్ తెల్సుకుని హీరోయిన్ లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు బెట్టుకుంటున్నా రు.

అయితే సీనియర్ హీరోయిన్ ల బాటలోనే కొనసాగుతున్న ఇప్పటి కొంతమంది హీరోయిన్ లు అలానే చేసి మంచి మంచి ఆఫర్స్ రాబట్టుకుంటున్నారు. ప్రేక్షకులకు ఏం కావాలో అదే కాదు దర్శక నిర్మాతలకు హీరోలకు కావాల్సింది కూడా సినిమాల్లో ఇస్తూ వారి ప్రేమాభిమానాలను అందుకుంటున్నారు. అయి తే ఇప్పటితరం హీరోయిన్స్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరో గా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించి సుశాంత్ కన్నా మంచి మార్కులు కొట్టేసింది.

నటించడానికి పెద్ద గా ఆస్కారం లేకపోయినా ఈమె తన గ్లామర్ తో అందరిని ఫిదా చేసింది. అయితే ఈమెకు ఇప్పుడు వరుస మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తున్నా యి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ ఈమెకు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పగా ఇప్పుడు ఆ మాట ప్రకారం తాను చేస్తున్న మహేష్ సినిమా లో ఆమె కోసం రెండో హీరోయిన్ పాత్ర ను ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇంకొంతమంది స్టార్ హీరో ల సరసన కూడా ఈమెకు అవకాశం వచ్చిందని టాక్ వస్తుంది. మరి ఈమె భవి ష్యత్ లో ఏ రేంజ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: