టాలీవుడ్ లో టాప్ సింగర్ల లిస్ట్ తీస్తే అందులో మొదటి వరుసలో సింగర్ మనో ఉండనే ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈయన తన గొంతును సవరించి గాయకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ స్టార్ సింగర్ గానే కొనసాగుతుండటం ఈయన ప్రతిభకు నిదర్శనం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో సింగర్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఈయన అసలు పేరు నాగుల్ మీరా, తన తాతగారు మరణించిన మరుసటి రోజు జన్మించడంతో ఆయనేపేరునే ఈయనకు పెట్టారు తన తండ్రి రసూల్. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈయన పేరును మనోగా మార్చారు.

తెర వెనుక గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యాజిక్ చేస్తూనే తెర ముందు కూడా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే శ్రీముఖి ప్రధాన పాత్రలో వచ్చిన క్రేజీ అంకుల్స్ చిత్రంలో మనో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇటు జబర్దస్త్ షో తో బుల్లి తెరపై కూడా తన హవా చాటుతున్నారు. ఈయనకు మొత్తం నలుగురు పిల్లలు కాగా ఒక అబ్బాయి చిన్నప్పుడే ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటూ బాదపడుతుంటారు. ఇది మనో ఫ్యామిలీకి మరిచిపోని విషాదంగా మిగిలిపోయింది. మనోకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.  పెద్ద కుమారుడు ఇప్పటికే తమిళ్ లో నటుడిగా రాణిస్తుండగా...రెండవ కొడుకు సినిమాల్లోకి త్వరలో రానున్నారని సమాచారం. కుమార్తె సోఫియా గొప్ప గాయకురాలు.

ఇక దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో మనోకి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్నో వందల పాటలను ఆయనతో కలసి ఒకే స్టేజ్ పై ఆలపించారు. బాలుతో మనోకి ఉన్న బంధం ఒకటో, పదో ఏళ్లు కాదు..35 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం వీరిది.  అసలు మనో సింగర్ కాకముందు నుండే బాలుతో పరిచయం ఉంది. అస్సలు వాస్తవానికి మనో సింగర్ కావడానికి ఒకరకంగా కారణం బాలు గారే. మనో మొదట మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర పని చేస్తున్న సమయంలో తన ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి నేడు ఈ స్థాయిలో ఉండటానికి బీజం వేశారు. కెరియర్ లోనే కాదు వ్యక్తిగత జీవితం లోనూ వీరిది గొప్ప స్నేహ బంధం. మనో పెళ్లికి ఎస్ పి బాలునే సాక్షి సంతకం పెట్టి పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని చూసుకున్నారని మనో పలు సందర్భాలలో స్వయంగా చెప్పారు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన ఆత్మీయ బంధం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: