అన్నదమ్ములైన చైతూ అఖిల్ లు ఇద్దరూ కేవలం ఒకనెల గ్యాప్ లో హిట్స్ కొట్టడంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల పై మరింత ఒత్తిడి పెరిగింది. టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ కంటే మీడియం రేంజ్ హీరోల మధ్య పోటీ చాల ఎక్కువగా ఉంది. దీనికితోడు మీడియం హీరోలు నటించిన సినిమాల విడుదల మధ్య గ్యాప్ చాల తక్కువగా ఉండటంతో ఆ చిన్న గ్యాప్ లోనే మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలను బ్రేక్ ఈవెన్ కు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.


యంగ్ హీరో నాగశౌర్య మంచి నటుడుగా గుర్తింపు పొందినప్పటికీ ఇంకా అతడికి టాప్ డైరెక్టర్స్ నుండి అవకాశాలు రావడం లేదు. దీనితో నాగశౌర్య తన దగ్గరకు వచ్చిన కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ తోనే సరిపెట్టుకోవలసిన్ ఏర్పడింది. మహిళా దర్శకురాలు లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తీసిన ‘వరుడు కావలెను’ మూవీతో తన దశ తిరుగుతుందని నాగశౌర్య భావిస్తున్నాచు.


ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీ ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గ ఈ సినిమా యూనిట్ ప్లాన్ చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక చోట్ల పెళ్ళిళ్ళు అవుతున్న సందర్భాన్ని గ్రహించిన ఈమూవీ యూనిట్ నగరంలోని కొన్ని కళ్యాణ మండపాలను ఎంచుకుని అక్కడ పెళ్ళి చేసుకుంటున్న వారికి తెలియకుండానే ఆ పెళ్ళి ముహూర్తానికి నాగశౌర్య హీరోయిన్ రీతువర్మ ను తీసుకుని అక్కడకు వెళ్ళడమే కాకుండా పెళ్ళి చేసుకుంటున్న నూతన వధూవరులకు గిఫ్ట్స్ ఇచ్చి అక్కడ వచ్చిన వారు అందర్నీ తమ ‘వరుడు కావలెను మూవీని చూడమని ప్రమోట్ చేస్తున్నారట.


అనుకోకుండా తమ పెళ్ళి మండపానికి వచ్చిన ఆ హీరో హీరోయిన్స్ ను చూసి పెళ్ళివారు ఆనందపడుతూ వారితో ఫోటోలు తీయించుకుంటున్నారు. ఇప్పుడు ఈసినిమా కాన్సెప్ట్ ప్రమోషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్లకు మళ్ళీ బాగా వస్తున్న పరిస్థితులలో ఈ లేటెస్ట్ ప్రమోషన్ ఎటు దారి తీస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: