టాలీవుడ్ టాప్ హీరో,
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి
బాలకృష్ణ ఆయన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ఆయన ఓ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో చాలా మంది ఆయన తోటి హీరోలు కొన్ని టాక్ షో లకు హోస్ట్ గా వ్యవహరించగా తొలిసారిగా
బాలకృష్ణ ఆహా యాప్ లో ప్రసారం అవుతుండగా అన్ స్టాపాబుల్ అనే షో కి ఆయన గెస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తో సహా చాలా మంది హోస్ట్ అవతారం ఎత్తగా
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నాడు అనగానే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరిచారు.
ఆ షో కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇటీవలే
అల్లు అరవింద్ కు దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఈ రోజు ప్రోమో విడుదల అయ్యింది.
నవంబర్ 4వ తేదీ నుంచి ఈ మొదటి
ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. మంచు వారి ఫ్యామిలీ గెస్ట్లుగా వచ్చి వారి విశేషాలను తెలపడం మరింత ఆసక్తిని పెంచుతుంది. మూడు నిమిషాల సమయం ఉన్న ఈ ప్రోమో ఈ టాక్ షో ఎలా ఉండబోతుంది అనేది తేల్చి చెప్పింది. ఇద్దరు సీనియర్ నటులు సంభాషణలు పంచుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ ప్రోమో లో చూపించారు.
మొదటి
ఎపిసోడ్ లోనే మంచి వారిని ఆహ్వానించి షో పై భారీ క్రేజ్ వచ్చేలా చేశారు. ఇక
మోహన్ బాబు మరియు
బాలకృష్ణ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో
మోహన్ బాబు తెలుగుదేశం పార్టీని స్థాపించింది అన్నగారు అయితే ఆయన తదనంతరం
టిడిపి పగ్గాలను నువ్వు చేత పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు కి ఎందుకు ఇచ్చావు అని
మోహన్ బాబును
బాలకృష్ణ ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పూర్తి
ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.