
ఇక అల్లు అర్జున సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం ఇస్తూనే ఉంటారు. సమయం దొరికిన్నప్పుడల్లా ట్రిప్స్ వేస్తూ..పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు పిల్లలకు సంబధించిన చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఉత్సాహ పరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి వీడియోలు..ఫోటోలు చాలానే చూశాం. అయితే ఈసారి బన్నీ షేర్ చేసిన వీడియో మాత్రం అభిమానులకు మతిపోయేలా చేసింది. ఇంతకి ఆ వీడియోలో ఏముందో తెలుసా..??
అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కి సంబంధించిన ఒక సర్ప్రైజ్ వీడియో ని అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అల్లు ఇంటి నుండి తరువాత జనరేషన్ గా అల్లు అర్జున్ కూతురు అర్హ..సమంత హీరోయిన్ గా చేస్తున్న శాకుంతలం సినిమా ద్వారా డెబ్యూ ఇస్తుండగా.. ఇప్పుడు అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మెగా హీరో వరుణ్ తేజ్ గని సినిమా కోసం రంగంలోకి దిగిన్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా..డైనమిక్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న చిత్రం గని. ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అల్లు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసిన అభిమానులు "నువ్వు మీనాన్న మించిపోతావు రా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.