బిగ్బాస్ కార్యక్రమము ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్  సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే గత సీజన్ల తో పోల్చి చూస్తే బుల్లితెర ప్రేక్షకులకు అంతగా ఎంటర్టైన్మెంట్ అందించడం లేదు అన్న టాక్ వినిపిస్తుంది. కానీ ఇక వారాంతం వచ్చిందంటే అందరి చూపు ఈ కార్యక్రమం పైన ఉండిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే వారం రోజుల పాటు కంటెస్టెంట్స్ హౌస్లో ఎంతలా తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా వారాంతంలో నాగార్జున వచ్చి ఇక అందరికీ వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు. శనివారం మొత్తం కంటెస్టెంట్ కి వార్నింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకుంటాడు నాగార్జున.



 కానీ ఆదివారం రోజున మాత్రం బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త రీతిలో ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ వినూత్నమైన టాస్క్ కూడా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇలా బుల్లితెర ప్రేక్షకులు అందరికి కూడా సందేహపడే గా మార్చేస్తూ ఉంటాడు ఇకపోతే ఇటీవల విడుదలైన బిగ్బాస్ నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో చూస్తే ఇక ఎపిసోడ్ ఎంతో సందడి సందడి గా సాగిపోతుంది అని అర్థమవుతుంది. అదిరిపోయే పాట పై డాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా షాక్ ఇచ్చాడు.



 సండే అంటే అందరూ ఫన్ డే అనుకుంటున్నారు కదా కానీ పనిష్మెంట్ డే అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత హౌస్ లో ఎవరికి ఏ పదం సరిపోతుంది అని చెప్పాలి అంటూ ఇక హౌస్మేట్స్ అందరికీ కూడా కొన్ని బోర్డులు ఇస్తాడు ఇక ఈ టాస్క్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న కాజల్, మానస్ ఇద్దరిని వెళ్లి ఒక ఒక బాక్స్ లో నుంచి బాల్ తీయ మంటాడు నాగార్జున. అయితే ఇక మానస్ బాల్ తీయడానికి వెళ్లిన సమయంలో ఏకంగా ప్రియాంక ఏడుపు ముఖం పెట్టేస్తుంది.ఎక్కడ మానస్ ఎలిమినేట్ అవుతాడో అన్న టెన్షన్ ప్రియాంక ముఖంలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: