బెల్లంకొండ శ్రీనివాస్ వి వి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన అల్లుడు శీను సినిమా తో వెండి తెరకు పరిచయం అయ్యాడు, ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించ,గా, తమన్నా ఒక ప్రత్యేక పాట లో మెరిసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో సక్సెస్ ని సాధించింది. ఆ తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కు అదిరిపోయే రేంజ్ హిట్ మాత్రం బాక్సాఫీసు వద్ద దక్కలేదు. ఆ సమయం లోనే తమిళం సూపర్ హిట్ మూవీ రక్షసన్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు సినిమా తో బెల్లంకొండ శ్రీనివాస్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా కెరియర్ లో మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత మళ్ళీ అల్లుడు అదుర్స్ సినిమా తో మరో ఫెయిల్యూర్ ను చూశాడు. ఇది ఇలా ఉంటే తెలు గు ఇండస్ట్రీ లో అనేక సినిమాలలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చత్రపతి సినిమా  రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు, ఈ సినిమా కు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  ఈ సిని మా ప్రారంభం అయి చాలా కాలం అవుతున్నప్పటికీ , ఈ సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు బయటికి రాలేదు. దాని తో ఈ సినిమా పై రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఒక అప్డేట్ తాజా గా బయటకు వచ్చింది, ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం లో జరుపుకుంటుంది. ఈ మేరకు సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటో ను షేర్ చేశారు. ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన చత్రపతి సినిమా టాలీవుడ్ లో ప్రభాస్ కు మంచి గుర్తింపును తీసుకో వచ్చింది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ కు చత్రపతి రీమిక్ బాలీవుడ్  ఎలాంటి గుర్తింపు ను తీసుకు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: