‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల అవుతుంటే ఈమూవీ జనవరి 6న ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాల షోల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ణయాలు వల్ల ఆరాష్ట్రంలో మిడ్ నైట్ షోలు తెల్లవారుజామున షోలు ప్రదర్శించే అవకాశం లేదు.


అయితే తెలంగాణలో మాత్రం ఇలాంటి నిబధనలు లేవు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ స్పెషల్ షోలు తెలంగాణాలో తెల్లవారుజాము నుండి ప్రారంభం అవుతాయి అని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇలాంటి అవకాశం లేదు కాబట్టి ఈమూవీని 6వ తారీఖు సెకండ్ షో నుండి వేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు రాజమౌళి చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ల రేట్ల విషయంలో కూడ ఎలాంటి నిబంధనలు లేవు. దీనితో క్రితంలానే బెనిఫ్ట్ షోలు టిక్కెట్ల రేట్లు పెంపుదల యదేచ్చగా కొనసాగే ఆస్కారం ఉంది. అలాంటి సదుపాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ధియేటర్లకు లేకపోవడంతో 6వ తారీఖు రాత్రి సెకండ్ షోను ఎన్ని ధియేటర్లలో అవకాశం ఉంటే అన్ని ధియేటర్లలో విడుదల చేసి ఒకరోజు ముందుగానే ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు చూపించే ఆలోచనలు జరుగుతున్నాయి అంటున్నారు.


వాస్తవానికి ఈ ఆలోచన వినడానికి బాగానే ఉన్నప్పటికీ అమెరికా లోని అనేక ప్రాంతాలలో చాల ఎక్కువ ధరకు ఈమూవీ ప్రీమియర్ షోలు పడుతున్న పరిస్థితులలో ఆషోల కంటే ముందుగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయిపోతే భారీ రేట్లకు ఈమూవీ ఓవర్సీస్ రేట్స్ ను కొనుక్కున్న బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీ టాక్ ఒకరోజు ముందుగా బయటకు రావడం జరిగితే నెగిటివ్ టాక్ కూడ ప్రచారంలోకి వచ్చే ప్రమాదం ఉంది అంటూ కొందరు రాజమౌళికి సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: