సంవత్సరానికి రెండు మూడు సార్లు ప్రభాస్ పెళ్ళి గురించి వార్తలు రావడం ఆతరువాత మళ్ళీ ఆవార్తలు చల్లారిపోవడం ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితి. 40 సంవత్సరాలు దాటిపోయిన ప్రభాస్ కు పెళ్ళి ఎప్పుడు అంటూ మీడియా వర్గాలు కృష్ణంరాజు ను అడిగినప్పుడల్లా అమ్మాయిలు రెడీగా ఉన్నారు అంటూ ప్రభాస్ ను ఒప్పించండి అంటూ జోక్ చేయడం కూడ పరిపాటి.


ఈమధ్య మళ్ళీ ప్రభాస్ పెళ్ళి వార్తల సందడి మొదలైంది. దీనికి కారణం అతడు నానక్ రామ్ గూడాలో కట్టుకోబోతున్న ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్ కు సంబంధించిన వార్తలు. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ నానక్ రామ్ గూడాలో 100 కోట్లతో ఒక భారీ గెస్ట్ హౌస్ ను కట్టబోతున్నట్లు వార్తల హడావిడి జరుగుతోంది. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మింపబడుతున్న ఈ గెస్ట్ హౌస్ నిర్మాణ బాధ్యతను ముంబాయికి చెందిన ఒక ప్రముఖ బిల్డర్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలను ఆధారంగా చేసుకుని ప్రభాస్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడని అందుకోసమే ఇంత భారీ గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతోంది అంటూ వార్తలు పుట్టుకు వస్తున్నాయి. ఈ వార్తలు కృష్ణంరాజు దృష్టి వరకు వెళ్ళాయో లేదో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ వార్తలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.


వాస్తవానికి ప్రభాస్ ప్రతిరోజు ఎదోఒక మూవీ షూటింగ్ లో పాల్గొంటు అతడి కుటుంబ సభ్యులకు కూడ అందుబాటులో ఉండటం లేదు అని అంటున్నారు. ‘రాథే శ్యామ్’ విడుదలకు రెడీ అయిన తరువాత ‘ఆదిపురుష్’ ‘సలార్’ నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ –K’ మూవీ షూటింగ్ లలో వరసపెట్టి పాల్గొంటూ ఒకదాని తరువాత ఒక సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలు అన్నీ పూర్తి అయిన తరువాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీలో నటించ వలసి ఉంది. ఇన్ని సినిమాల షూటింగ్ ల హడావిడి మధ్య ప్రభాస్ పెళ్ళికి ఎక్కడ సమయం దొరుకుతుంది అంటూ చాలామంది జోక్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: