తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసుడు గా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ..  నందమూరి బాలకృష్ణ సినిమా ఏదైనా విడుదలైంది అంటే చాలు థియేటర్ దగ్గర ప్రేక్షకులు టికెట్ల కోసం పోటీపడుతుంటారు. ఇలా ఒకప్పుడు సినిమా హీరోల టికెట్ల కోసం పోటీ పడ్డ వారిలో తర్వాత సినిమాల మీద ప్యాషన్తో డైరెక్టర్గా మారిపోయిన వారు కూడా ఉంటారు.





 ఇలా ఒకప్పుడు బాలకృష్ణ సినిమా టికెట్ల కోసం థియేటర్ వద్ద గొడవ పడిన దర్శకుడు ఇప్పుడు బాలకృష్ణతో సినిమా తీసి రేంజ్ కి ఎదిగాడు.  అతను ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు గోపీచంద్ మలినేని. గతంలో సరైన హిట్ లేక ఎంతగానో ఇబ్బందిపడిన గోపీచంద్  ఇటీవల రవితేజ తో తెరకెక్కించిన క్రాక్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి. ఇకపోతే ఇక ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ కు బిగ్ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న unstoppable అనే కార్యక్రమానికి విచ్చేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. డైరెక్టర్ కాకముందు యువకుడిగా ఉన్న సమయంలో ఒక థియేటర్ దగ్గర గొడవ తీయడంతో అరెస్టయ్యారట కదా అంటూ బాలకృష్ణ ప్రశ్నించడంతో.. మీరు నటించిన సమరసింహా రెడ్డి సినిమా కోసమే గొడవ జరగడంతో ఇక పోలీసులు అరెస్టు చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పోలీసులు ఏమన్నా అన్నారా అని ప్రశ్నించగా ఒక రౌండ్ వేసుకున్నారు అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని నవ్వేసాడు. బాలకృష్ణ సినిమా పై గోపీచంద్ మలినేని ఏమన్నాడో తెలియాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: