నూత‌న సంవ‌త్స‌రం 2022కు స్వాగ‌తం ప‌లుకుతూ సినీ అభిమానుల ఆనంద ఉత్స‌వాల‌ను అంబ‌రాన్ని తాకేవిదంగా చేసింది ఆ సినిమా సాంగ్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి రానా కాంబినేష‌న్‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్  నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచెనాలు నెల‌కొని ఉన్నాయి. స్క్రీన్ ప్లే సంభాష‌ణ‌లు సుప్ర‌సిద్ధ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత త్రివిక్ర‌మ్ అందిస్తుండ‌గా. నిర్మాత సూర్య‌దేవ‌ర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర.
అయితే ఈ భీమ్లానాయ‌క్ చిత్రం నుండి డిసెంబ‌ర్ 07, 2021న లాలా భీమ్లా అడ‌వి పులి గీతం విడుద‌లైన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు, స్క్రీన్ ప్లే స‌మకూర్చుతున్న త్రివిక్ర‌మ్ గీతాన్ని ర‌చించ‌డం విశేషం. కేవ‌లం మాటల్లో మాత్ర‌మే కాదు పాట‌లో సైతం త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిని ప‌లుక‌రించార‌న్న‌ది ఈ పాట వింటే ఇట్టే అర్థ‌మ‌వుతోంది. సామాజిక మాధ్య‌మాల‌లో సైతం హోరెత్తిన‌ది ఈ గీతం. ఈ గీతాన్ని ఇప్పుడ డీజే వెర్ష‌న్‌లో మ‌రొక మారు విడుద‌ల చేసింది చిత్ర బృందం.

ముఖ్యంగా 2021కి వీడ్కోలు ప‌లుకుతూ.. 2022 నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతూ అభిమానులు ఆనందోత్స‌వాలు జ‌రుపుకునేందుకు భీమ్లానాయ‌క్ డీజే సాంగ్ వ‌చ్చింది.  పోరాట స‌న్నివేశాల‌లో భాగంగా భీమ్లానాయ‌క్ చిత్రంలో ఈ సాంగ్ క‌నిపిస్తుంది. అయితే త‌మ‌న్ స్వ‌రాలు అరుణ్ కౌడిన్య గాత్రం మ‌రింత హుషార్‌ను క‌లిగిస్తే.. మూడు నిమిషాల 37 సెక‌న్ల పాటు ఈ పాటలో క‌నిపిస్తున్న  దృశ్యాలు ఈ విష‌యాన్ని మ‌రింత స్ప‌ష్టం చేసాయి. డీజే వ‌ర్ష‌న్ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ఈ పాట మిలియ‌న్ కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

 తొలుత భీమ్లానాయ‌క్ చిత్రం సంక్రాంతి బ‌రిలో ఉంటుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే సంక్రాంతి బ‌రిలో పాన్ ఇండియా మూవీలైన ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌డంతో భీమ్లానాయ‌క్‌ను వాయిదా వేసారు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల విడుద‌ల చేయ‌నున్నారని ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ విడుద‌లను నిన్న వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో భీమ్లానాయ‌క్ సినిమా సంక్రాంతి బ‌రిలో నిలువ‌నున్న‌ట్టు మ‌ళ్లీ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌లో ఉన్న‌ట్టు  స‌మాచారం. భీమ్లానాయ‌క్ విడుద‌ల పై చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: