ఓసారి నూతన సంవత్సరం సందర్భంగా హీరోయిన్ యమున మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఇంటికి వెళ్ళిందట. కానీ, ఆ సమయంలో చిరంజీవి ఇంట్లో లేరట. అయితే యమున ఇంటికి రావడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్..ఎదురెళ్లి మళ్లీ ఆహ్వానించారట. అలాగే `అన్నయ్య లేరు గుడికి వెళ్లారు కాసేపు అవగానే వచ్చేస్తారు. అప్పటి వరకు ఇక్కడ కూర్చోండ`ని పవన్ చెప్పాడట.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ యమునకు ఎన్నో మర్యాదలు కూడా చేశారట. ఆయన ప్రవర్తనకు షాక్ అయిపోయిన యమున గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించింది. ఒక స్టార్ హీరో కుటుంబంలో ఉన్నటువంటి వారికి గర్వం ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, పవన్ మాత్రం అలా కాదు. తాను ఏ హోదాలో ఉన్నప్పటికీ.. ఇతరులకు మాత్రం ఎంతో గౌరవాన్ని ఇస్తాడంటూ యమున చెప్పుకొచ్చింది.కాగా, పవన్ సినిమాల విషయానికి వస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` మూవీ చేస్తున్నాడు. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే పవన్ మరోవైపు క్రిష్ డైరెక్షన్లో `హరి హర వీరమల్లు`, హరీష్ శంకర్ డైరెక్షన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం పవన్ చేతిలో ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి