నాగ చైతన్య, తన తండ్రి నాగార్జున తో కలిసి నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఇందులో హీరోయిన్ గా రమ్యకృష్ణ, కృతి శెట్టి నటించింది.. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఈ సినిమాని జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తంగా కలిసి నిర్మించడం జరిగింది. ఈ సినిమా నిన్నటి రోజున బ్రహ్మాండం గా విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది. ఇక ఇది 2016 సంవత్సరంలో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి పార్ట్-2 గా తీయబడింది.. ఈ సినిమా స్టోరీ కాస్త రొటీన్ గా అనిపించినప్పటికీ.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-2.5 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.75 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.25కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-76 లక్షల రూపాయలు.
5). వెస్ట్-65 లక్షల రూపాయలు.
6). గుంటూరు-95 లక్షల రూపాయలు.
7). కృష్ణ-46 లక్షల రూపాయలు.
8). నెల్లూరు-40 లక్షల రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ కలుపుకుని మొదటి రోజు మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. 8.27 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-1.10కోట్ల రూపాయలు.
11). వరల్డ్ వైడ్ గా మొదటిరోజు సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే..9.37 కోట్ల రూపాయలు. ఈ కలెక్షన్స్ నాగార్జున కెరియర్, నాగచైతన్య కెరియర్ లోనే మొదటి రోజు బెస్ట్ కలెక్షన్ లు గా మిగిలాయి.

ఇక బంగార్రాజు మూవీ..38.31 ఎక్కువ కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే 39 కోట్ల రూపాయలను రాబట్టాలి. ఇక మొదటి రోజే 9.37 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇక 29 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది.. ఇక అన్నీ చిన్న సినిమాలే విడుదల కాక కేవలం బంగార్రాజు సినిమా ఒక్కటే పెద్దది కాబట్టి ఈ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: