ఎన్టీఆర్ సరసన తమన్నా, సమంత , కాజల్ లాంటి వారు మాత్రమే నటిస్తూ మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా నేషనల్ క్రష్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని పొందినట్లు సమాచారం.. ఇకపోతే రష్మిక మందన్న వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది.. ఇక ఎవరూ సాధించలేనన్ని విజయాలు తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తూ దేశ ప్రజలను మెప్పించింది..


పుష్ప పాన్ ఇండియా సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ నేషనల్ క్రష్ బ్యూటీ బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటోంది.. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మిక మందన తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ , మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం ఈమె పుష్ప రెండవ భాగం షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.. తాజాగా ఈమెకు  మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లుగా సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

అసలు విషయంలోకి వెళ్తే ఆర్ ఆర్ ఆర్  సినిమా తర్వాత ఎన్టీఆర్  కొరటాల శివ దర్శకత్వంలో మాస్ మూవీ తెరకెక్కించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు నెట్టింట్లో తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదట బాలీవుడ్ భామ ఆలియా నటిస్తోందని వార్త వినిపించింది ఆ తర్వాత కియారా అద్వాని ,ఆ తర్వాత సమంత ఇలా కొంత మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రష్మిక మందన్న ను  సంప్రదించగా ఆమె ఎన్టీఆర్ తో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్రం మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: