
ఈ రెండు సినిమాలతో తెలుగులో మళ్లీ తన ఫాం కొనసాగించాలని చూస్తుంది తమన్నా. సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది కీర్తి సురేష్. లేటెస్ట్ గా ఒంటి నిండా బంగారంతో ఓ క్రేజీ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలతో పాటుగా మెరిసేదంతా బంగారమే కావొచ్చు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కీర్తి సురేష్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ తన హవా కొనసాగిస్తుంది.
తెలుగులో అమ్మడి ఖాతాలో ఓ రెండు భారీ ప్రాజెక్టులు ఉండగా మరో స్టార్ సినిమా కూడా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. సౌత్ అన్ని భాషల్లో వరుస క్రేజీ ఆఫర్లతో కీర్తి సురేష్ తన సత్తా చాటుతుంది. మహానటి సినిమాతో మనసులు దోచిన కీర్తి సురేష్ ప్రతి సినిమాలో తన ప్రత్యేకత చాటాలని చూస్తుంది. మన దగ్గర ఉన్న చాలా తక్కువ మంది అభినయ తారల్లో కీర్తి సురేష్ ఒకరని చెప్పొచ్చు. కీర్తి సురేష్ కి సోషల్ మీడియా ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఆమె షేర్ చేస్తున్న ప్రతి ఫోటోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వస్తున్నారు.